Friday, July 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి

ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్
రాష్ట్ర ప్రభుత్వ విప్పు, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై వ్యక్తిగత దూషణలు, అసత్య ఆరోపణలు చేయడం తగదని, కాంగ్రెస్ పార్టీ  పట్టణ, మండల అధ్యక్షుడు కట్టెదముల సాగర్ రెడ్డి, గంధ మల్ల అశోక్ అన్నారు. ఆలేరు పట్టణంలో  శుక్రవారం  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు రాజకీయంగా సమాధానం చెప్పాల్సింది పోయి వ్యక్తిగత విమర్శలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.

మండల బీఆర్‌ఎస్ నాయకుడు కర్రే వెంకటయ్య చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు ఉండవచ్చని, అయితే అవి వ్యక్తిగత స్థాయికి దిగజారకుండా ప్రజా సమస్యలు, అభివృద్ధి, పాలన అంశాలకే పరిమితం కావాలని సూచించారు.

ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నియోజకవర్గంలో రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలను అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని అశోక్ తెలిపారు. ఏ సమస్య వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయం చేస్తున్న నాయకుడిపై అసత్య ప్రచారం చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఎప్పటికీ విజయవంతం కావని అన్నారు.

ప్రజాస్వామ్యంలో విభేదాలు సహజమే అయినప్పటికీ పరస్పర గౌరవం పాటించడం ప్రతి రాజకీయ నాయకుడి బాధ్యత అని పేర్కొన్నారు. ఆరోపణలు చేయాలంటే ఆధారాలతో ప్రజల ముందు మాట్లాడాలని, వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. ఇకపై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై నిరాధార ఆరోపణలు, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజాస్వామ్యబద్ధంగా తగిన విధంగా స్పందిస్తామని  హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ , మున్సిపల్ కౌన్సిలర్ జూకంటి సంపత్, మాజీ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మాజీ ఎంపీటీసీ ఆరె ప్రశాంత్, సీనియర్ నాయకులు బీజన భాస్కర్ , నీలం వెంకటస్వామి, సర్పంచ్ మోతిలాల్, బుగ్గ నవీన్, యాదగిరి, అందె అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -