- Advertisement -
నవతెలంగాణ-ఆమనగల్ : రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావును తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మెన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతు మృతిచెందారు. ఈసందర్భంగా బుధవారం గోలి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఫుడ్ కమీషన్ సభ్యులతో కలిసి సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా హరీష్ రావుతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కార్యక్రమంలో కమీషన్ సభ్యులు ఆనంద్, శారద, భారతి తదితరులు ఉన్నారు.
- Advertisement -



