Saturday, July 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్ల బ్లాక్-ను సందర్సించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

తాడిచెర్ల బ్లాక్-ను సందర్సించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు:- సింగరేణి అధికారులతో కలిసి తాడిచెర్ల కోల్ బ్లాక్ మైన్- 2ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ క్రిష్ణ శనివారం సందర్షించారు.ఈ సందర్భంగా ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించి ఎన్ని ప్రభావిత గ్రామాలు,ఎంత మంది భూములు కోల్పోతున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు.సింగరేణి బిజెపి భరోసా పేరుతో పెద్దపెల్లి జిల్లాకు వస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సింగరేణి కార్మికులకు ఓగిఫ్ట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.పర్యావరణ అనుమతులు త్వరగా తీసుకువచ్చి మైన్ ను త్వరగా ప్రారంభం అయ్యేలా చూడాలన్నారు.తాడిచెర్ల మైన్ పేరిట రాజకీయాలు వద్దని అతి త్వరగా పర్మిషన్లు తీసుకువచ్చి మైన్ పనులు ప్రారంభిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.మూడు నెలల్లో ఈ మైన్ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.తాడిచెర్ల మైన్ నుంచే సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంచుతూ హామీ ఇవ్వాలన్నారు.ఈ మైన్ తో ఈ ప్రాంతం అభివృద్ధి చెందడమే కాక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.ఈ ప్రాజెక్టుతో 50వేల కోట్ల రూపాయల టర్నోవర్ పెరుగుతుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -