Saturday, July 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యాదాద్రి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ ప్రమాణ స్వీకారం 

యాదాద్రి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ ప్రమాణ స్వీకారం 

- Advertisement -

– పాల్గొన్న ఎంపీ చామల, బీర్ల
నవతెలంగాణ ఆలేరు 
: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (ట్రస్ట్ బోర్డ్ )నూతన పాలకమండలి భక్తుల కు అన్ని వసతులు కల్పించాలి.తిరుపతికి దీటుగా అభివృద్ధి చెందేందుకు చొరవ చూపాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.యాదగిరిగుట్ట దేవస్థానంలో శనివారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని అని మాట్లాడారు.హైదరాబాద్ చెరువలో ఉన్న యాదిగిరి గుట్ట తెలంగాణ ప్రజలు తెలంగాణ తిరుపతిగా భావిస్తారని. రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి అన్ని విధిగాలుగా సహకరిస్తుందన్నారు.తెలంగాణ ఏర్పడిన 12 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే మొదటిసారిగా గుట్ట మరింత వేగంగా అభివృద్ధి చెందేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతనంగా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి చైర్మన్గా మన్నె సత్యనారాయణ రెడ్డి. మరో 9 మంది ప్రముఖులతో బోర్డు సభ్యులుగా నియమించడం జరిగిందన్నారు.నూతన ఏర్పడిన ట్రస్ట్ బోర్డ్ సభ్యులకు అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి. ఆశించిన విధంగా ట్రస్ట్ బోర్డ్  దేవస్థానాన్ని  మరింత అభివృద్ధి చేసేందుకు ట్రస్టు సభ్యుల పైన ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు.

 ప్రభుత్వ విప్  ఐలయ్య మాట్లాడుతూ దేవస్థాన అభివృద్ధి కి స్థానిక ఎమ్మెల్యేగా పూర్తి సహకారం ఈ బోర్డు ఉంటుందన్నారు.ట్రస్ట్ మెంబర్లు కొణిదల సురేఖ వినోద్ వెంకట్ స్వామి.చిలుపు గారి విజయ రాజా రామ్. విజయేందర్ పుల్ల పోచబోయిన ఈశ్వరమ్మ. గుండ్ల మల్లయ్య. స్వాతి కంతమనేని.. ఎం రాఘవేంద్రరావు. లక్ష్మీనారాయణ నాయక్. అభినందనలు తెలిపారు.వీరితోపాటు దేవస్థాన కార్యనిర్వాహణాధికారి.భవాని ప్రసాద్ ప్రధాన అర్చకులు.స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -