ప్రియమైన వేణు గీతికకు
నాన్నా ఎలా ఉన్నావు? ఈ మధ్య నీకు ఆఫీస్ పని ఎక్కువైనట్లుంది. సెలవు రోజుల్లో, సాయంత్రం ఇంటికి వచ్చాక కూడా రాత్రి చాలా సేపటి వరకు పని చేస్తున్నావు? ఏదైనా సరే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకు. ఇక్కడ అప్పుడప్పుడు సాయంత్రం పూట కొంచం చినుకులు పడుతున్నాయి. కాస్త వేడి తగ్గింది. వాతావరణంలో మార్పులవల్ల అనారోగ్యాలు మొదలౌతున్నాయి.
సరే నాన్న.. గత కొద్ది వారాలుగా పిల్లల పెంపకం గురించి చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వయసు. అంటే పదవ తరగతి తర్వాత వారు కాలేజీలో చేరినప్పటి నుండి అత్యంత కీలకం. పిల్లలకు విలాసవంతమైన జీవితం అలవాటు చేయకూడదు. అయితే వారికి ఇష్టమైన రంగంలో రాణించేందుకు సౌకర్యాలు కల్పించాలి. ఈ వయసులోనే వారు ప్రలోభాలకు, దురలవాట్లకు, ఆకర్షణలకు లోనౌతారు. ఈ వయసులో వారితో స్నేహంగా ఉంటూ, ఎక్కువ సమయం గడపాలి. వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో గమనించాలి. ప్రలోభాలకు లొంగుతున్నారనిపిస్తే ప్రేమతో సర్ది చెప్పాలి. జరిగే నష్టాలు తెలియజేయాలి. నాకు తెలిసిన ఒకామె, వారి కొడుకు చిన్నప్పుడు వంద రూపాయలు అడిగితే వెయ్యి ఇచ్చేవారట. డబ్బు చేతిలో ఉండే సరికి విలాసాలకు అలవాటు పడ్డాడు. పెద్దయ్యాక తల్లిదండ్రులను డబ్బు కోసం, ఆస్తి కోసం పీడించే వాడు. ఎంత చెప్పినా వినకుండా, వారికి తెలియకుండా కొంత ఆస్తిని అమ్మేశాడు. ఇది వాళ్లకు చాలా రోజుల తర్వాత తెలిసి షాకయ్యారు. మా పెంపకం సరిగా లేక పోబట్టే ఇలా అయ్యాడని బాధపడ్డారు. నిజమే, వాళ్లదే తప్పు. అందుకే విలాసాలకు కాకుండా సౌకర్యాలు కల్పించి వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలి.
పిల్లలకు ఇష్టం లేని వివాహం చేయడానికి బలవంతపెట్టడం, చిన్నప్పటి నుండి పిల్లలని ఇతరులతో పోలుస్తూ దూషించడం, తల్లిదండ్రులు చేస్తున్న తప్పు అని కొన్ని ఘటనలు చూస్తే అనిపిస్తుంది. అలాగే తల్లిదండ్రులు పిల్లల సుఖ సంతోషాలు కోరుకుంటారు. తెలిసీ తెలియని తనం కాబట్టి పెళ్లై వారే సర్దుకుంటారని అనుకుంటారు. పిల్లల మనస్తత్వం తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి కొన్ని విషయాలను వారితో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.
పిల్లలకు జాగ్రత్తలు చెప్పాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


