ఐసిడిఎస్ సిబ్బంది అంగన్వాడీ ల డిమాండ్ న్యాయం అయిన వే నని,వారి హక్కుల సాధన కోసం జనసేన నైతిక మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నియోజక వర్గం ఇంచార్జి డేగల రామచంద్రరావు అన్నారు. సమ్మె శనివారం నాటికి 20 వ రోజుకు చేరిన క్రమంలో ఆయన సమ్మె శిబిరాన్ని సందర్శించి జనసేన తరపున మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐసిడిఎస్ సిబ్బంది న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని,ప్రభుత్వం ఉద్యోగులుగా వారిని గుర్తించి, ప్రభుత్వం తరపు నుండి వర్తించే ప్రతి సౌకర్యాన్ని వీరికి కల్పించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ సమస్యను తెలంగాణ రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకువెళ్లి వారికి పూర్తి మద్దతు తెలియజేస్తామని, ఐసిడిఎస్ సిబ్బందికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో మండల అద్యక్ష ఉపాధ్యక్షులు,పట్టణ అద్యక్షులు దామెర బాబీ, ఇస్లావత్ వినోద్,ఆనంద్, ప్రధాన కార్యదర్శి మల్లం రామ కృష్ణ,వీరమహిల యనమదల సునీత,తెలగ రెడ్డి సత్యనారాయణ,క్రాంతి,మౌళి, ముత్యాల రావు, జన సైనికులు పాల్గొన్నారు.