- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం వెనిగండ్ల గ్రామ అయ్యప్ప స్వాముల మహాపడి పూజ కార్యక్రమానికి బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి స్వాములను ఆహ్వానించారు. ఈ మేరకు హాజరైన స్వాములు పూజలు నిర్వహించారు. స్వాములకు పాండన్న గురువారం రాత్రి అల్పాహారం అందజేశారు. ఈ సందర్బంగా అయ్యప్ప స్వాములు భక్తి పాటలతో మహా పడిపూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. తదనంతరం స్వామి వారికి పాండన్న పిలుపు మేరకు తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెనిగండ్ల అయ్యప్ప స్వాములు, భక్తులు,పలు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



