- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రానికి చెందిన సామ కిషన్ ఆర్ జి ఎన్ మానవ హక్కుల సంస్థ, అవినీతి నిరోధక సంస్థ మండల అధ్యక్షునిగా నియమితులయ్యారు. ఈ మేరకు సామ కిషన్ ను మానవ హక్కుల సంస్థ, అవినీతి నిరోధక సంస్థ మండల అధ్యక్షునిగా నియమిస్తూ జాతీయ అధ్యక్షులు దేవానంద నాయుడు, జాతీయ కార్యదర్శి శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఆర్ జి ఎన్ మానవ హక్కుల సంస్థ, అవినీతి నిరోధక సంస్థ మండల అధ్యక్షునిగా నియమించినందుకు జాతీయ అధ్యక్షులు దేవానంద నాయుడు, జాతీయ కార్యదర్శి శ్రీనివాస్,ఆర్మూర్ ప్రెసిడెంట్ రవీందర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



