- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం జరగనుంది. విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్, SIPBలో ఆమోదం పొందిన పలు ప్రాజెక్టులపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే విశాఖ పెట్టుబడుల సదస్సులో కుదిరిన ఒప్పందాలపైనా సమగ్రంగా చర్చిస్తారని తెలుస్తోంది. స్థానిక ఎన్నికల సన్నద్ధతమైనా చర్చించే అవకాశం ఉంది.
- Advertisement -



