Sunday, December 7, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిమరి మనసారుకు…

మరి మనసారుకు…

- Advertisement -

‘పాలమ్మిన, పూలమ్మిన, ఎమ్మెల్యేగా గెలిచినా, మంత్రిని కూడా అయిన…’ మాస్‌ మహారాజా, మాజీ మినిష్టర్‌ చామకూర మల్లారెడ్డి తరచూ కొట్టే డైలాగులివి. ఇదే తరహాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మామ…’ప్చ్‌.. ఎనిమిది యుద్ధాలను ఆపిన, ఎన్నో దేశాలను కాపాడిన.. అయినా నోబెల్‌ బహుమతి రాలేదు…’ అంటూ తెగ ఇదై పోతున్నారు. ట్రంప్‌ మామ మాటలు విన్న నెటిజన్లు…’ఆ మామ సంగతి సరే.. ఇక్కడ మన ఢిల్లీలో ఉండే ‘పెద్ద’ తాత కూడా దేశానికి మస్తు సేవలు జేసిండు.

పెద్ద నోట్ల రద్దుతో క్యూలైన్లలో పేదల ప్రాణాలు తీసిండు.. జీఎస్టీతో ప్రజల నడ్డి విరగ్గొట్టిండు, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని నమ్మబలికి, మొండి చేయి చూపిండు.. విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకొచ్చి, ప్రతీ భారతీయుడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్నడు..ఇయ్యన్నీ జరిగి పదేండ్లు దాటిపాయే.. తాత వీటి గురించి పూర్తిగ మరిచిపోయిండు.. వీటి గురించి అడిగితే చెప్పటానికి టైం లేక మీడియాతో ఒక్కసారంటే ఒక్కసారి గూడ ప్రెస్‌ కాన్ఫరెన్సు పెట్టలేకపోయిండు.. యోగా చేస్కుంట.. నెమలికి గింజలేసుకుంట మస్తు బిజీగున్నడు.. మరి మన ‘పెద్ద’ తాతకు ప్రజాహితుడు, అత్యుత్తమ పరిపాలనాదక్షుడు… అనే బిరుదులు ఇవ్వాల్సిందే…’ అంటూ డిమాండ్‌ చేస్తున్నారు. మరి మన తాతకు ఆ బిరుదులు ఇద్దామంటారా..?

-కె.నరహరి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -