నవతెలంగాణ – హైదరాబాద్ : వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల పరిధిలోని బుద్ధారం లక్ష్మీతాండ గ్రామ పంచాయతీలో దారుణ హత్య కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని గొంతు కోసి హత్య చేసిన ఘటన స్థానికంగా భయాందోళనకు గురిచేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీతాండకు చెందిన మెగ్య నాయక్ (55) తన నివాసంలో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి అతనిపై దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. అనంతరం గొంతు కోసి హత్య చేసి అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. హత్య జరిగిన తీరును పరిశీలిస్తూ పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
దారుణ హత్య.. గొంతు కోసి వ్యక్తిని హతమార్చిన దుండగులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


