Monday, July 27, 2026
E-PAPER
Homeఆటలునా కల నెరవేరింది: వైభవ్ సూర్యవంశీ

నా కల నెరవేరింది: వైభవ్ సూర్యవంశీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు అందుకోవడం నిజంగా కల నెరవేరిన క్షణం అని భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సిరీస్ తనకు ఎంతో ప్రత్యేకం అని, తొలిసారి ఈ రెండు అవార్డులను ఒకేసారి గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉందని సిరీస్ ముగింపు అనంతరం వ్యాఖ్యానించాడు. తన విజయం వెనుక కెప్టెన్, కోచ్‌ల మద్దతు ఎంతగానో ఉందని, వారు తనపై ఉంచిన నమ్మకమే స్వేచ్ఛగా ఆడేందుకు దోహదపడిందని అన్నాడు.

ఈ పర్యటనలో తన సన్నద్ధత గురించి వైభవ్ మాట్లాడుతూ, “హరారేకు వచ్చిన తర్వాత రెండు, మూడు రోజుల పాటు మా ప్రిపరేషన్ చాలా బాగా జరిగింది. గతంలో నేను అండర్-19 ప్రపంచకప్ కూడా ఇక్కడే ఆడాను. కాబట్టి ఈ వేదికలో ఆడటాన్ని నేను చాలా ఆస్వాదిస్తాను” అని తెలిపాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ తనకు అండగా నిలిచారని, వారి ప్రోత్సాహం వల్లే తాను మెరుగైన ప్రదర్శన చేయగలిగానని సూర్యవంశీ వివరించాడు.

తన దూకుడైన ఆటతీరు గురించి మాట్లాడుతూ, “టీ20 క్రికెట్‌లో నా ఆటతీరు ఎలా ఉంటుందో, ఈ సిరీస్‌లోనూ అదే ప్రదర్శించాను. జట్టు కోసం నా సహజమైన ఆటను ఆడటానికి ప్రయత్నించాను. మూడు మ్యాచ్‌లలోనూ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇవ్వాలనే లక్ష్యంతో బరిలోకి దిగాను” అని వైభవ్ తన బ్యాటింగ్ శైలి గురించి చెప్పాడు. “ఒకసారి మంచి ఆరంభం లభించిన తర్వాత, దానిని భారీ ఇన్నింగ్స్‌గా మలచాలనేది నా ఆలోచన. ప్రాక్టీస్ సెషన్స్‌లో నేను ఏ షాట్లు అయితే సాధన చేస్తానో, అవే షాట్లను మ్యాచ్‌లోనూ అమలు చేయడానికి ప్రయత్నిస్తాను” అని తన సక్సెస్ మంత్రాన్ని పంచుకున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -