- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఎనిమిది నెలల పాటు విజయవంతంగా మిషన్ పూర్తి చేసిన అమెరికా, రష్యా వ్యోమగాములు ఆదివారం సురక్షితంగా భూమికి చేరుకున్నారు. నాసాకు చెందిన క్రిస్ విలియమ్స్, రష్యా అంతరిక్ష సంస్థకు చెందిన సెర్గీ కుద్-స్వెర్చ్‌కోవ్, సెర్గీ మికాయెవ్లు సోయుజ్ MS-28 వ్యోమనౌకలో కజకిస్థాన్‌లోని స్టెప్పీస్ ప్రాంతంలో విజయవంతంగా ల్యాండ్ అయ్యారు. భూమి వాతావరణంలోకి ప్రవేశించిన చివరి దశలో పారాచూట్లు సక్రమంగా తెరుచుకోవడంతో ల్యాండింగ్ సాఫీగా జరిగింది. క్రిస్ విలియమ్స్, సెర్గీ మికాయెవ్‌లకు ఇది తొలి అంతరిక్ష యాత్ర కాగా, సెర్గీ కుద్-స్వెర్చ్‌కోవ్‌కు ఇది రెండో మిషన్.
- Advertisement -



