Tuesday, August 11, 2026
E-PAPER
Homeజిల్లాలుచిన్నతూండ్ల సర్పంచ్ గా గడ్డం క్రాంతి ఏకగ్రీవం

చిన్నతూండ్ల సర్పంచ్ గా గడ్డం క్రాంతి ఏకగ్రీవం

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు
స్థానిక ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలంలోని చిన్నతూండ్ల గ్రామపంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు గడ్డం క్రాంతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే గ్రామ ఉపసర్పంచ్ తోపాటు నాలుగు వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవం అయినట్లుగా తెలుస్తోంది. ఆయితే మంగళవారం ఉపసంహరణ కావడంతో ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా గ్రామాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకొని జిల్లాలోని చిన్నతూండ్ల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని క్రాంతి తెలిపారు. చిన్నతూండ్ల గ్రామ సర్పంచ్ ఏకగ్రీవం కావడంపై పలువురు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -