నవతెలంగాణ – ఆలేరు టౌన్: ఆలేరు మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక నాయకులు మంగళవారం మున్సిపల్ మేనేజర్ జగన్మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. ఒకటో వార్డు నుంచి 12వ వార్డు వరకు పలు సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే ప్రజలను చైతన్యవంతం చేసి పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆలేరు పట్టణ అధ్యక్షుడు నంద గంగేష్, ఐదో వార్డు కౌన్సిలర్ పాషికంటి సంపత్ మేనేజర్‌కు అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ, ఆలేరు పట్టణ ప్రధాన కార్యదర్శి ఎలగల వెంకటేష్, ఉపాధ్యక్షుడు సుక్క రాజు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కళ్లెం రాజు గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ వడ్డెమాను నరేందర్, నాయకులు తునికి దశరథ, బందెల సుభాష్, కంతుల శంకర్, ఎ. సంపత్, పూల హనుమంతు, పి. ఆనంద్, గుర్రం నర్సింలు, పరవని స్వామి, రాజేశ్వర్, రచ్చ రాము, మైదం భాస్కర్, వైకుంఠం తదితరులు పాల్గొన్నారు.



