- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఇంక్విలాడ్ మొంచో నేత ఉస్మాన్ హదీ మృతి వార్తతో ఆయన మద్దతుదారులు దాడులకు పాల్పడ్డారు. బంగ్లాదేశ్‌లోని పురాతన వారసత్వ సంపద కలిగిన సాంస్కృతిక సంస్థలలో ఒకటైన ఛాయానౌత్ పై గురువారం రాత్రి దాడి చేశారు. ఆందోళనకారులు ధన్‌మొండిలో ఉన్న ఛాయానౌత్ కార్యాలయాన్ని ధ్వంసం చేసి నిప్పంటించారు. ఈ కారాల్యయం లోపల ఉన్న ఫర్నీచర్, సంగీత వాయిద్య పరికరాలను విరగ్గొట్టారు. ఈ ఘటనను ఛాయానౌత్ ప్రధాన కార్యదర్శి లైసా అహ్మద్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. ‘ఈ దాడి వల్ల కొన్ని ముఖ్యమైన పుస్తకాలు, వాయిద్య పరికరాలు, సాహిత్య కళాఖండాలు ధ్వంస్మయ్యాయి. ఈ ఘటనపైదర్యాప్తు చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
- Advertisement -



