నవతెలంగాణ – ఆలేరు
ఆలేరు నియోజకవర్గంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీ 140 స్థానాల్లో గెలిచిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం నాడు సీఎం నివాసంలో కలిసిన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఎన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు అని ప్రభుత్వ విప్ ఐలయ్య నవతెలంగాణకు చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు ప్రత్యేకంగా ఆలేరు నియోజకవర్గంలో మీ సంబంధాలతో పాటు మార్నింగ్ వాక్, ఇందిరమ్మ మొదట నిర్మించిన వారికి గొర్రెపోడేలు, ఉచితంగా ఇండ్లకు సిమెంటు, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో ముఖ్యపాత్ర ఉందని ముఖ్యమంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపినట్లు చెప్పారు.
ప్రభుత్వం సంక్షేమ పథకాలైన రేషన్ కార్డులు, సన్న బియ్యం, రుణమాఫీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు లాంటి పథకాలు ద్వారా ప్రజా పాలన కొనసాగించడం వల్లనే ఆలేరు విజయాలు కాంగ్రెస్ గెలుపు సాధ్యమైందని చెప్పినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచులు మూడంట రెండు వంతుల స్థానాలు గెలుపొందడం జరిగిందని ముఖ్యమంత్రిచెప్పినట్లు రాబోయే ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా అత్యధిక స్థానాలు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సమన్వయపరిచి పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలను ఆశ మాషిగా తీసుకోవద్దని ముఖ్యమంత్రి సూచించినట్లు చెప్పారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు ముఖ్య మంత్రి నాయకత్వ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేసి శాలువాతో సన్మానించినట్లు చెప్పారు.



