- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తుర్కా వడగమలోని ‘శ్రీ సమర్థ్ ప్రొటెక్ట్’ పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో మంటలు భారీగా ఎగసిపడటంతో మిల్లులో నిల్వ ఉంచిన లక్షల రూపాయల విలువైన పత్తి నిప్పుకు ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.
- Advertisement -



