కర్నాటక కుట్రలను తక్షణమే విరమించాలి
అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలి
ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టులను కాపాడాలి : సీఎం రేవంత్‌రెడ్డికి మాజీమంత్రి హరీశ్‌రావు లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను తక్షణమే విరమించాలని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తుంగభద్ర ప్రాజెక్టుపై కర్నాటక ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డికి బుధవారం ఆయన లేఖ రాశారు. ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలని సూచిం చారు. తెలంగాణ జల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యతను విస్మరించి, రాష్ట్ర ప్రయోజనాలను పక్క రాష్ట్రాల వద్ద తాకట్టు పెట్టే ప్రమాదకరమైన విధానా లను కాంగ్రెస్ ప్రభుత్వం అవలం బిస్తోం దని విమర్శించారు. నదుల అనుసం ధానం పేరుతో గోదావరి జలాల ను తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి సహకారం అందిస్తు న్నదని తెలిపారు. ఇప్పుడు తుంగభద్రపై కర్నా టక ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల విషయంలో కూడా అదే ద్రోహ బుద్దితో వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. పాలమూరు బిడ్డనని చెప్తూ అదే ప్రాంతంలోని రైతాంగం భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు కర్నా టక నుంచి ఎన్‌వోసీ తెస్తున్నామనే సాకు చెప్పి, తెలంగాణ జల హక్కులను బేరసారాల అంశంగా మార్చారా?అని అడిగారు. తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న కురిడి (రెండు టీఎంసీలు), చిక్కాలపర్వి (2.5 టీఎంసీలు), చిక్కాలమంచి (ఐదు టీఎంసీలు) బ్రిడ్జ్-కమ్-బ్యారే జ్‌లకు తెలంగాణ ప్రభుత్వం సమ్మతి తెలిపిందా?అని ప్రశ్నించారు. 2025 జులై 18న కొడంగల్ లిఫ్ట్‌కు కర్నా టక ఎన్‌వోసీ ఇవ్వడం వెనుక జరిగిన మతలబు ఏంటని? అడిగారు. ఏడాది కాలంగా కర్నా టక అక్రమ నిర్మాణాలపై అభ్యం తరం చెప్పలేదంటే పరోక్షంగా వాటికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిం చినట్టేనా?అని ప్రశ్నించారు. తెలంగాణ నీటిని కర్నాటకకు తాకట్టు పెట్టే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని అడిగారు. ఎగువన కర్నాటక చేపడుతున్న కురిడి ఎత్తిపోతల పథకం చిక్కాల పర్వి, చిక్కాలమంచి బ్యారేజీలు పూర్తయితే ఆర్డీఎస్‌కు రావాల్సిన ప్రవాహాలు తీవ్రంగా తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ), తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అనుమతులు లేకుండానే కర్నాటక ప్రభుత్వం తుంగభద్రపై ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఈ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదనీ, దీని వెనుక ఉన్న లోపాయికారీ ఒప్పందాలు ఏంటని ప్రశ్నించారు. ఆర్డీఎస్ చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు సరిగ్గా అందని పరిస్థితి ఉందని తెలిపారు. కర్నాటకకు కేటాయించిన పరిమితులను దాటి అదనపు సాగు చేస్తోందని పేర్కొన్నారు. ఆర్డీఎస్‌లో కర్నాటక వాటా 1.2 టీఎంసీలుంటే, సగటున ఐదు టీఎంసీల నీటిని వినియోగిస్తున్నదని వివరించారు. కర్నాటక కొత్తగా నిర్మిస్తున్న బ్యారేజీలు పూర్తయితే తెలంగాణ వాటా మరింత తగ్గిపోతుందని ఆందోళన వ్యకం చేశారు. ఆర్డీఎస్ పూర్తిగా నిర్వీర్యమయ్యే ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు.
తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం, వాటిని దెబ్బతీసే కర్నాటక అక్రమ నిర్మాణాలకు పరోక్షంగా సహకరించడం రాష్ట్రానికి ద్రోహం చేయడం కాదా?అని ప్రశ్నించారు. కర్నాటక అక్రమ ప్రాజెక్టుల ప్రభావం కేవలం ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టులకే పరిమితం కాదని తెలిపారు. తుంగభద్ర నుంచి శ్రీశైలం జలాశయానికి వచ్చే ప్రవాహాలు తగ్గితే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులతో పాటు తాగునీటి అవసరాలు, భవిష్యత్తు నీటి ప్రణాళికలు తీవ్రంగా దెబ్బతింటాయని వివరించారు. తుంగభద్రపై కర్నాటక చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను తక్షణమే అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు అభ్యంతరాలు తెలపాలని సూచించారు. తుంగభద్ర జలాల వినియోగంలో బచావత్ ట్రిబ్యునల్ విధించిన నిబంధనలను కర్ణాటక తప్పకుండా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే కర్నాటక అక్రమ ప్రాజెక్టులపై సుప్రీం కోర్టులో కేసు వేయాలని డిమాండ్ చేశారు. కొడంగల్ లిఫ్ట్ కోసం తెలంగాణ జల హక్కులను బేరసారాల అంశంగా మార్చలేదని ప్రభుత్వం నిరూపించాలని తెలిపారు. జల హక్కులను కాపాడుకోవడానికి మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి తీసుకురావొద్దని హెచ్చరించారు. తెలంగాణ జల హక్కులను కాపాడటం కోసం బీఆర్ఎస్ నిర్విరామ పోరాటం చేస్తుందని తెలిపారు.
తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులు తాకట్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



