Thursday, June 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగీతంలో ‘సీనియర్ రీసెర్చ్ ఫెలో’ అవకాశం

గీతంలో ‘సీనియర్ రీసెర్చ్ ఫెలో’ అవకాశం

- Advertisement -


దరఖాస్తు గడువు జులై 10, ఇంటర్వ్యూ 14న
నవతెలంగాణ-పటాన్‌చెరు

భారత ప్రభుత్వ అను సంధాన్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్‌ఆ‌ర్‌ఎఫ్) నిధులు సమకూర్చే ప్రాజెక్టు కింద, హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ విశ్వ విద్యాలయంలో సీనియర్ రీసెర్చ్ ఫెలో (ఎ‌స్‌ఆర్‌ఎఫ్) పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తు న్నారు. ఈ మేరకు యూనివర్సిటీ యాజమాన్యం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఫార్మాస్యూటిక్స్ లేదా ఫార్మాకాలేజీలో ఎం. ఫార్మసీలో తొలిశ్రేణిలో ఉత్తీర్ణత, బలమైన అకడమిక్ రికార్డు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. ఈ నియామకం తాత్కాలిక మైనదని, ప్రారంభంలో ఒక ఏడాది ఉంటుందని తెలిపారు. సంతృప్తికరమైన పనితీరు ఆధారంగా మూడేండ్ల వరకు పొడిగించవచ్చని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.42 వేల ఫెలోషిప్‌తోపాటు ఇంటి అద్దె భత్యం (హెచఆరఏ) కూడా వర్తిస్తుందని చెప్పారు. దరఖాస్తు తేదీ నాటికి గరిష్ట వయో పరిమితి 28 సంవత్సరాలు ఉండాలని, భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ తాజా సీవీ, మార్కుల ధ్రువీకరణ పత్రాలు, జీపీఏటీ/ఎన్‌ఈటీ అర్హత ధ్రువీకరణ పత్రం (ఉంటేనే), స్వీయ ప్రచురిత ప్రతాలు (ఏవైనా ఉంటే).. అన్నింటినీ కలిపి ఒకే పీడీఎఫ్ ఫైల్‌గా bsatapat @gitam.edu కు ఈ మెయిల్ చేయాలన్నారు. దాని సబ్జెక్ట్ లైన్‌లో Application for SRF Position under ANRF Project అని పేర్కొన్నాలని స్పష్టం చేశారు. దరఖాస్తులను జులై 10వ తేదీలోగా సమర్పించాలని, జులై 14న ఇంట ర్వ్యూలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు మాత్రమే ఈమెయిల్ సమాచారం పంపుతామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -