నవతెలంగాణ -పెద్దవూర
హాలియా మున్సిపాలిటీ కార్పెంటర్స్ యూనియన్ కమిటీ హాల్ నిర్మాణం కొరకు బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండురంగారెడ్డి గురువారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం, అనుముల మండలం, హాలియ మున్సిపాలిటీ నందు విశ్వబ్రాహ్మణుల ఆహ్వానం మేరకు శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకొని 50,000 లు అందజేశారు.అనంతరం కమిటీ సభ్యులు పాండురంగారెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈసందర్బంగా విశ్వబ్రాహ్మణుల కమిటీ సభ్యులు అడగ్గానే వాళ్ళ కోరిక మేరకు కమిటీ హాల్ నిర్మాణం కోసం యాభై వేల రూపాయలు విరాళం ప్రకటించిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డికి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కాతోజు ఏల్లయ్య చారి, ప్రధాన కార్యదర్శి నాగార్జున పరిపూర్ణచారి,పోతోజు శేఖర చారి, కోశాధికారి బ్రహ్మచారి, ఉపాధ్యక్షుడు యాదగిరి చారి, సైదాచారి,గౌరవ అధ్యక్షులు కృష్ణాచారి, మోహనచారి,సాగర్ చారి, శ్రీనివాస చారి, ముఖ్య సలహాదారులు సత్యనారాయణ చారి, శ్రీనివాస చారి,ద్రోణచారి,ఆంజయచారి ఇంకా పలువురు పాల్గొన్నారు… వీరితో పాటు తిరుమలగిరి మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, మాజీ ఆపరేటివ్ నాగెండ్ల కృష్ణారెడ్డి, తేరా అఖిల్ రెడ్డి, గజ్జల నాగార్జున రెడ్డి,వంగాల భాస్కర్ రెడ్డి, ఇస్రం లింగస్వామి, అనుముల కోటేష్,గాలి నరేందర్ రెడ్డి, అబ్దుల్ కరీం, మొయిన్ పాషా, షేక్ రఫీ మరియు తదితరులు పాల్గొన్నారు.