
నవతెలంగాణ – సిద్దిపేట
సైక్లింగ్ క్రీడాకారులు సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని డివై ఎస్ ఓ నాగేందర్ సూచించారు. ఖేలో ఇండియా సైక్లింగ్ సెంటర్ లో గురువారం కొత్తగా వచ్చిన సైకిల్ లను, ట్రాక్ షూట్లను, హెల్మెట్లను, షూ లను సైక్లింగ్ క్రీడాకారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత మాదని, మీరు మాత్రం బాగా క్రీడల్లో రాణించి సిద్దిపేటకు మెడల్స్ తీసుకురావాలని కోరారు. పిడి సుజాత మాట్లాడుతూ మంచి కోచ్ ఉన్నాడని, బాగా శిక్షణ పొంది జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలని కోరారు. విద్యార్థులు ఉదయమే లేచి శిక్షణకు వస్తుండడం మీరు ఇప్పుడే విజేతలుగా నిలిచారని అన్నారు. హాస్టల్ వార్డెన్ సత్యనారాయణ మాట్లాడుతూ క్రమశిక్షణతో శిక్షణ తీసుకొని, మీకు ఇస్తున్న సైకిల్లను ఉపయోగించుకొని బాగా శిక్షణ పొందాలన్నారు. కోచ్ సంజీవ్ మాట్లాడుతూ క్రీడాకారుల కోసం అడగగానే సైకిలు అందించిన డివై ఎస్ ఓ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న వారు రాష్ట్ర స్థాయి, జాతీయస్థాయిలో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారుల తల్లిదండ్రులు శ్రీనగర్, శ్రీనివాస్, బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.