రాష్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సుదర్శన్, సాగర్, కోశాధికారిగా మూడ్ శోభన్
93 మందితో నూతన కమిటీ..29 మంది ఆఫీస్ బేరర్లు
కొత్తగూడెంలో విజయవంతంగా ముగిసిన మహాసభ
పలు తీర్మానాలు ఆమోదం
రైతాంగ ఉద్యమ కార్యాచరణ సిద్ధం
వ్యవసాయ ప్రణాళిక శాస్త్రీయబద్ధంగా ఉండాలి : రాష్ట్ర ప్రభుత్వానికి నూతన కమిటీ డిమాండ్
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి / కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సామినేని రామారావు నగర్, కాసాని ఐలయ్య ప్రాంగణంలో జరిగిన తెలంగాణ రైతు సంఘం మహాసభలో అనేక తీర్మానాలు చేశామని, తదనుగుణంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించామని సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌రావు, తీగల సాగర్ తెలిపారు. మహాసభ ముగింపు సందర్భంగా కొత్తగూడెం క్లబ్‌లో శనివారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మహాసభ తీర్మానాలు, కార్యాచరణ వివరాలు వెల్లడించారు. ఈనెల 23, 24, 25 తేదీల్లో కొత్తగూడెం క్లబ్‌లో జరిగిన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభ విజయవంతంగా ముగిసిం దని చెప్పారు. మహాసభలో 30 అంశాలపై చర్చించి తీర్మానాలు చేశామని తెలిపారు. ప్రభుత్వం వ్యవసాయ ప్రణాళికను రూపొందించి సక్రమంగా అమలు చేయాలని, అవి శాస్త్రీయబద్ధంగా ఉండాలని, చిత్తశుద్ధితో పంటల ప్రణాళికను అమలు చేయాలంటే వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సమస్యలు లేకుండా చూడాలని, సక్రమంగా సాగునీరు అందించాలని అన్నారు. ఎరువులు, పురుగు మందులు తదితర అంశాల్లో జరుగుతున్న లోపాన్ని సరి చేయాలని, సరైన పద్ధతిలో ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వానికి సూచించారు. భూభారతిలో గతంలో వచ్చిన సమస్యలే పునరావృతం అవుతున్న నేపథ్యంలో వాటిని సరి చేయాలన్నారు. పోడు సాగుదారులకు నాలుగు లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చినప్పటికీ ఇంతవరకూ లబ్దిదారులకు సేద్యం చేసుకోవడానికి వీలు కల్పించడం లేదన్నారు. వెంటనే లబ్దిదారులకు భూమి చూపించి సేద్యం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, వారికి రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా వారికి లబ్దిదారులకు రైతుబంధు అందజేయాలని మహాసభ తీర్మానం చేసిందన్నారు. ఇంకా పోడు పట్టాలు ఇవ్వాల్సిన అర్హులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని, రైతుబంధు అమలు చేసి సహకార రుణాలు అందజేయాలని కోరారు. ఈ తీర్మానాలను అమలు చేయడం కోసం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రైతు ఉద్యమాలు నిర్మిస్తామన్నారు.
సమస్యలపై పోరాటం
దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని, అమెరికా – భారత్ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో భారత రైతాంగ స్థితిగతులపై సభలో చర్చించామని పోతినేని, సాగర్ అన్నారు. రాబోయే వ¶డు సంవత్సరాలపాటు జరిగే పోరాటాలు, ఉద్యమాల కార్యాచరణ అమలు చేయాల్సిన బాధ్యత నూతన కమిటీపై ఉందన్నారు.
93 మందితో రాష్ట్ర నూతన కమిటీ
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నట్టు సుదర్శన్, సాగర్ తెలిపారు. 93 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. వీరితోపాటు ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులు ఉంటారని తెలిపారు. 29 మందిని ఆఫీస్ బేరర్లుగా ఎన్నుకున్నట్టు చెప్పారు. రాష్ట్ర అధ్యక్షులుగా పోతినేని సుదర్శన్ రావు, ప్రధాన కార్యదర్శిగా తీగల సాగర్, కోశాధికారిగా వ¶డ్ శోభన్, ఉపాధ్యక్షులుగా జూలకంటి రంగారెడ్డి, ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు, పి.జంగారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, మాదినేని రమేష్, కందాల ప్రమీల, మల్లు నాగార్జునరెడ్డి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, శెట్టి వెంకన్న, ఎం.శ్రీనివాస్, తుమ్మల వెంకట్ రెడ్డి, వర్ణ వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శులుగా అన్నవరపు సత్యనారాయణ, బొంతు రాంబాబు, శీలం ఫకీరమ్మ, లెల్లెల బాలకృష్ణ, ఉడుత రవీందర్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మాటూరి బాలరాజ్ గౌడ్, ఈసంపల్లి బాబు, వెంకటేష్, డి.బాల్‌రెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్య, వెంకట్ మావో, దుబ్బాక రాంచందర్, చందు నాయక్ ఎన్నికయ్యారని వివరించారు.
మహాసభ కర్తవ్యాలు
రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణం పోరాటాలు చేసేందుకు సిద్ధమయ్యారు. మొక్కజొన్న పంట చేతికొచ్చిన తరుణంలో కనీస మద్దతు ధర రూ.2400 చొప్పున వెంటనే పంటంతా కొనుగోలు చేయాలని కోరారు. ఇప్పటికే వరి కోతలు ప్రారంభమైన ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 27వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలను సందర్శించి, అక్కడ జరుగుతున్న అక్రమాలు, అవకతవకలను ఎండగట్టే విధంగా వినతిపత్రాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మహాసభలో నిర్ణయించారు. రైతు భరోసా ఎకరా.. ఎకరాకు.. కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం రూ.7500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారు. సబ్సిడీ కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వ¶డ్ శోభన్, జూలకంటి రంగారెడ్డి, అన్నవరం సత్యనారాయణ, కొక్కెరపాటి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రైతు సంఘం నూతన కమిటీ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



