- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య కొడవలితో నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. శివ, లక్ష్మి భార్య భర్తలు. కొంత కాలంగా కుటుంబంలో తరచుగా గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో లక్ష్మి తన భర్తపై కొడవలితో దాడి చేసి హతమార్చింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
- Advertisement -



