Friday, June 26, 2026
E-PAPER
Homeఆటలువైభవ్ సూర్యవంశీ అభిమానులకు నిరాశే

వైభవ్ సూర్యవంశీ అభిమానులకు నిరాశే

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఐర్లాండ్ పర్యటన తొలి టీ20తోనే వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఇస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఓపెనర్‌గా అతడిని ఆడించడం లేదని టాస్ సమయంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చెప్పాడు. పొట్టి వరల్డ్ కప్‌లో ఇన్నింగ్స్ ఆరంభించిన అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌ను ఆడిస్తున్నామని అయ్యర్ పేర్కొన్నాడు. టాస్ గెలిచిన అతడు బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గాయం నుంచి కోలుకుని స్క్వాడ్‌లోకి వచ్చిన హర్షిత్ రానాకు చోటు దక్కింది.

Here is how #TeamIndia lines up for the 1️⃣st T20I against Ireland 📝

Updates ▶️ https://t.co/gdoXw2dAKR#IREvIND pic.twitter.com/H5nvE6XpQE

— BCCI (@BCCI) June 26, 2026

భారత తుది జట్టు : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌(కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, సుందర్, హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ.

ఐర్లాండ్ తుది జట్టు : టిమ్ టక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లొర్కాన్ టక్నర్‌(కెప్టెన్, వికెట్ కీపర్), బెంజమిన్ కాలిట్జ్, గరెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, లియాం మెక్‌కార్తీ, మాథ్యూ హంప్రెస్, జై మూండ్రా, మాథ్యూ హోలార్డ్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -