నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణంలో ఈ ఆదివారం జరిగే సోమ వంశ సహస్రర్జున క్షత్రియ సమాజ్ ఎన్నికలలో ఓటు వేసి గెలిపించాలని క్షత్రియ సమాజ్ మహాదాత పడాల్ మనోజ్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎటువంటి హోదాలో లేకున్నా పేద పిల్లలకు నా వంతు సహాయంగా ఉచిత పుస్తకాల పంపిణీ చేసినట్టు, సంవత్సరానికి ఒకసారి జరిగే గావ్ ను జుమ్మన్ దత్త జయంతి పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమము పూర్తిగా సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. నా సమాజ ప్రజల కొరకై అన్ని విధాలుగా ముందు ఉండి చేసినట్టు, యువజన సమాజ్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో సుమారు 100 మంది పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ ఒక సంవత్సరం పాటు వారికి సహాయంగా అందించినట్టు తెలిపారు. ఇది దృష్టిలో ఉంచుకొని సమాజసేవకై సమాజ అభివృద్ధి కొరకై మార్పు కోసం నన్ను ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్ లో నేను చేసినటువంటి సహాయాన్ని దృష్టిలో ఉంచుకొ నీ నిచ్చెన గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరినారు.. సమాజ సభ్యుడిగా సంఘంలో లేకున్నా సమయంలో కూడా నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సహాయంగా ఉన్నట్టు, భారీ మెజారిటీతో గెలిపిస్తారని మీపై నమ్మకంతో మీ ముందుకు వస్తున్నానని తెలిపారు.
అధ్యక్ష పదవికి ఓటు వేసి గెలిపించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



