- శివసేన (యుబిటి) నేత సంజయ్ రౌత్
నవతెలంగాణ-హైదరాబాద్: అయోధ్య రామమందిర నిర్మాణం కోసం ఇచ్చిన నగదు, వస్తువులకు సంబంధించి ఇప్పటివరకు ట్రస్ట్ రసీదులు ఇవ్వలేదని శివసేన (యుబిటి) నేత సంజయ్ రౌత్ శుక్రవారం వ్యాఖ్యానించారు. అయోధ్య రామామందిరానికి తమ పార్టీ కోటి రూపాయల విరాళం ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు రసీదు అందలేదని అన్నారు. ట్రస్ట్ ఏర్పడిన సమయంలోనే పార్టీ కోటి రూపాయలకు చెక్ ఇచ్చామని, కానీ ఇప్పటివరకు రసీదు అందలేదని అన్నారు. ఆలయ నిర్మాణం కోసం రామ జన్మభూమి తీర్థ క్షేత్రకు 24 కేజీల వెండి ఇటుక కూడా ఇచ్చామని, దానికి కూడా రసీదు ఇవ్వలేదని అన్నారు. విరాళాల నిధులతో ఎమ్మెల్యేలను, ఎంపిలను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్, స్థానిక బిజెపి నేతలను కాపాడేందుకు యత్నిస్తున్నారని అన్నారు. వారు తక్కువ ధరకు భూమిని కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయించారని అన్నారు.



