నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలో 108 అంబులెన్స్ లో సేవలు అందిస్తున్న సిబ్బందికి సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ కూలర్ వితరణ చేశారు. మండల కేంద్రంలోని 108 అంబులెన్స్ కార్యాలయంలో వేసవి ఎండల తీవ్రతను తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ కు విన్నవించారు. తక్షణమే స్పందించిన సర్పంచ్ దంపతులు 108 సిబ్బందికి వారి కార్యాలయంలో వేసవి ఎండల నుండి సేద తీరేందుకు కూలర్ ని వితరణ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ కొత్తపల్లి హారిక, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ మాట్లాడుతూ మండల పరిదితో పాటు చుట్టుపక్కల మండలాలకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న 108 సిబ్బంది వారు అత్యవసర పరిస్థితుల్లో ఎంతోమంది ప్రాణాలు కాపాడి,వారికి మనోధైర్యాన్ని ఇస్తున్నరన్నారు. 108 సిబ్బంది వేసవికాలంలో ఎండల్లో అత్యవసర కేసులకు వెళ్లిరాగానే కార్యాలయంలో వేసవి తపన్ని తట్టుకోలేని పరిస్థితులో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, కార్యాలయానికి కూలర్ కొనివ్వమని కోరినట్లు తెలిపారు.
తక్షణమే స్పందించి వారికి కూలర్ అందించామన్నారు. ఆపద సమయంలో ఎన్నో ప్రాణాలు కాపాడి 108 సిబ్బంది ప్రాణధాతలుగా నిలుస్తున్నారని, వారికి ఈ చిన్న సహాయం తప్పక చేయాలని వారి కార్యాలయంలో కూలర్ ను అందించినట్లు తెలిపారు. 108 సిబ్బంది మాట్లాడుతూ మేము అడగ్గానే తక్షణమే స్పందించి మాకు కూలర్ వితరణ చేసిన సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రోత్సాహంతో ఇంకా రెట్టింపు స్థాయిలో ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు సుభాష్ గౌడ్, గ్రామ అభివృద్ధి కమిటీ కోశాధికారి పన్నాల రవి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మైలారం సుధాకర్, భారత్ రెడ్డి, రమేష్,108 సిబ్బంది సాగర్, విజయ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.



