Sunday, April 26, 2026
E-PAPER
Homeఖమ్మంరజతోత్సవ ముగింపు వేడుకలు విజయవంతం చేద్దాం 

రజతోత్సవ ముగింపు వేడుకలు విజయవంతం చేద్దాం 

- Advertisement -

– బీఆర్ఎస్ నాయకులు సంపూర్ణ పార్టీ శ్రేణులకు పిలుపు
నవతెలంగాణ – అశ్వారావుపేట 

బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా సోమవారం నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ అశ్వారావుపేట పట్టణ అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణ పార్టీ శ్రేణులకు ఆదివారం పిలుపునిచ్చారు. సోమవారం నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పట్టణంలో ని మూడు రోడ్ల ప్రధాన కూడలి లో గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పార్టీ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించబడుతుందని, కావున పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసిన అభ్యర్థులు, ప్రస్తుత కౌన్సిలర్లు ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. అలాగే ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,మహిళా నాయకురాళ్లు,రైతు నాయకులు విద్యార్థి, యువజన నాయకులు గ్రామ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి చేసారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -