Sunday, April 26, 2026
E-PAPER
Homeకరీంనగర్రాయికల్ సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

రాయికల్ సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్
మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో మహితాపూర్, రామోజీపేట, మూటపెల్లి, కొత్తపేట గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కేంద్రాలను అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇంచార్జీ సాయికుమార్, సంబంధిత గ్రామాల సర్పంచ్‌ల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు పండించిన వరి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించుకోవాలని సూచించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సీఈఓ ఎలిగేటి రవికుమార్, ఆయా గ్రామాల సర్పంచులు తలారి నాగమణి, బెజ్జంకి మోహన్, సంగెం కీర్తన, మీనుగు రాజగంగు, మాజీ డైరెక్టర్లు బేతి మోహన్ రెడ్డి, బోడ భూమరాజం, నాయకులు రమేష్, అంజయ్య, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -