- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కేసీఆర్ అధ్యక్షతన నేడు(సోమవారం) హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు హాజరుకానున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ విస్తరణపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గులాబీ జెండాలు ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎండల దృష్ట్యా ఈసారి కార్యక్రమాలను పరిమితంగా నిర్వహించాలని సూచించారు.
- Advertisement -



