‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రాన్ని దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కించారు. ఈ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో విరాట్ కర్ణ హీరోగా నటించారు. నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రే కర్, మురళీ శర్మ, దక్ష నాగార్కర్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం మేకర్స్ ‘వీరనాగ` సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాట నాగ సాధువుల ఆధ్యాత్మిక తాండవాన్ని అద్భుతంగా ఆవిష్కరించిం ది. శ్రీహర్ష ఈమని సాహిత్యం ఆధ్యాత్మిక భావాన్ని బలంగా ప్రతిబింబిం చగా, దీపక్ బ్లూ తన పవర్ ఫుల్ వోకల్స్ తో పాటకు ప్రాణం పోశారు. జునైద్ కుమార్ – అభే అందించిన సంగీతం ప్రతి ఫ్రేమ్‌లో భక్తి భావాన్ని మరింత ఎలివేట్ చేసింది. కైలాస పర్వతాన్ని తలపించే అద్భుతమైన నేపథ్యంతో తెరకెక్కించిన ఈ పాటలో నాగ సాధు తాండవం విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నాగ సాధుగా విరాట్ కర్ణ తాండవం కట్టిపడేసింది. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా ఈ సినిమా విడుదల కానుంది అని మేకర్స్ తెలిపారు.
నాగసాధు విశ్వరూపం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



