91 పరుగులతో వరంగల్‌పై గెలుపు
నవతెలంగాణ-హైదరాబాద్
టీజీ20లో అనురాగ్ నల్గొండ నైట్స్ బోణీ కొట్టింది. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్‌పై అనురాగ్ నల్గొండ నైట్స్ 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నల్గొండ నైట్స్ తొలుత 20 ఓవర్లలో 5 వికెట్లకు 259 పరుగులు చేసింది. గౌరవ్ రెడ్డి (80, 33 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), నితీశ్ రెడ్డి (81, 42 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధనాధన్ అర్థ సెంచరీలతో చెలరేగారు. రాహుల్ బుద్ది (31), అర్ఫాజ్ అహ్మద్ (33) రాణించారు. దివేశ్ సింగ్ (18 నాటౌట్) అదిరే ముగింపు అందించాడు. గౌరవ్, నితీశ్ మెరుపులతో నైట్స్ టీజీ20 లీగ్‌లో సంయుక్త అత్యధిక స్కోరు సాధించింది. రికార్డు ఛేదనలో వరంగల్ వారియర్స్ తడబడింది. ఆమన్ రావు (46, 15 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగినా.. అతడి నిష్ర్కమణ తర్వాత వారియర్స్ చేతులెత్తేసింది. మురుగన్ అభిషేక్ (44) మినహా ఆ జట్టులో ఎవరూ రాణించలేదు. నల్గొండ బౌలర్లలో శరణు నిశాంత్ (3/42), అనికెత్ రెడ్డి (2/63), వరుణ్ గౌడ్ (3/10) వికెట్లు పడగొట్టారు. నితీశ్ రెడ్డి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
నల్గొండ నైట్స్ బోణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



