Friday, June 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలునిరీక్షణకుతెర పడింది

నిరీక్షణకుతెర పడింది

- Advertisement -

కిచ్చా సుదీప్ హీరోగా, అనుప్ భండారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బిల్లా రంగ బాషా`. ఈ చిత్రం 2209 AD ఫ్యుచర్ లో సెట్ చేయబడిన ఇంతకు ముందె న్నడూ చూడని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించనుంది.
గ్రాండ్ స్కేల్ లో భారతీయ సినిమా నుంచి సైన్స్ ఫిక్షన్ కథ చెప్పడంలో ఒక అడ్వంచర్ జర్నీని సూచిస్తోంది. బ్లాక్‌బస్టర్ హనుమాన్ మేకర్స్ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె. నిరం జన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాణంలో అద్భుతమైన స్టార్ పవర్, టెక్నికల్ వాల్యూస్ లో ఈ సినిమా న్యూ బెంచ్ మార్క్ ని క్రియేట్ చేయనుంది అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా షూటింగ్ నేటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ‘నిరీక్షణ కు తెరపడింది… యుద్ధం మొదలవు తోంది’ అని మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. గన్ పట్టుకొని ఇంటెన్స్ లుక్ లో సుదీప్ పోస్టర్లో కనిపించారు. ఈ లుక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియో, లోగో రివీల్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మూవికి సంబం ధించిన మరిన్ని ఎగ్జైటింగ్ అప్డేట్స్ మేకర్స్ త్వరలో ప్రకటిస్తారు అని యూనిట్ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -