Friday, June 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిషాన్ని పండిస్తున్నాం

విషాన్ని పండిస్తున్నాం

- Advertisement -

కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పురుగుమందుల ఆధారిత వ్యవసాయం వల్ల సమాజంపై పడుతున్న తీవ్ర ప్రభావాన్ని ఈ చిత్రం ప్రధానాంశంగా తీసుకుంది. రోజూ కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేస్తున్న ఈ సమస్యపై అవగాహన కల్పించడమే ఈ సినిమా లక్ష్యం. జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్‌పై చేతన్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. సాగర్ బి. షిండే కథ, నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తు న్నారు. ఈ చిత్రం జూలై 24న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. టీజర్‌లో కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే న్యాయం కోసం పోరాడుతూ, పురుగుమందుల ఆధారిత వ్యవసాయం వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజాలను వెలికితీసే ప్రయత్నం చేయడం ఆసక్తికరంగా ఉంది. రోజువారీ ఆహారంలోకి చేరుతున్న విషపూరిత రసాయనాలు, ముఖ్యంగా యువత ఆరోగ్యంపై చూపుతున్న తీవ్ర ప్రభావాన్ని టీజర్ ఆవిష్కరించింది. భావోద్వేగాలతో పాటు సామాజిక బాధ్యతను ప్రతిబింబించే కథతో, తరచూ మన దృష్టికి రాని ఒక కీలక సమస్యను ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది అని టీజర్ స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -