హీరో హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా ‘దీవాన. ఇటీవల థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఏర్పాటు చేసిన థ్యాంక్యూ మీట్ కు హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా విచ్చేశారు. డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ,'మా మూవీని బ్యాడ్ చేసేందుకు చాలామంది ప్రయత్నించారు. ఈ సినిమాను చంపాలని ఎంత చూసినా లేస్తూనే ఉంటుంది అని తెలిపారు. ‘మేము చాలా మంచి సినిమా చేశాం. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా చేశాంఅని ప్రొడ్యూసర్ శ్రీదేవి కార్యంపూడి చెప్పారు. ప్రొడ్యూసర్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ,'సినిమా అనేది అందుబాటు ధరల్లో ఉండాలనేది మా కోరిక. అందుకే సింగిల్ స్క్రీన్స్ లో వంద రూపాయలు, అన్ని పీవీఆర్ స్క్రీన్స్ లో 105 రూపాయలకే టికెట్ ప్రైస్ పెట్టాం అని అన్నారు. ‘సినిమా చూశాను. చాలా బాగుంది. శనివారం ఏపీ, తెలంగాణలో ప్రతి ఊర్లో ఫస్ట్ 25 టికెట్స్ ఎవరు కొంటే వారికి మరొక టికెట్ ఫ్రీ ఇస్తాం. మీకు సినిమా నచ్చితే మరొకరిని థియేటర్స్ కు తీసుకెళ్లండి, లేదా ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టండి. అది సినిమాకు బూస్ట్ ఇస్తుంది. మీ టైమ్ వెస్ట్ అవ్వదనే నమ్మకంతో చెబుతున్నా. కచ్చితంగా మీకు నచ్చుతుంది` అని హీరో శ్రీవిష్ణు చెప్పారు.
ఒక టికెట్ కొంటే మరొకటి ఉచితం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



