Friday, June 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఉత్కంఠభరితంగా 'తత్వం'

ఉత్కంఠభరితంగా ‘తత్వం’

- Advertisement -

దినేష్‌ తేజ్‌, దష్విక.కె జంటగా నటిస్తున్న సినిమా ‘తత్వం’. అర్జున్‌ కోల దర్శకుడు. త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో వంశీ సీమకుర్తి, శ్వేత పసుపులేటీ నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత భరత్‌ మాట్లాడుతూ,’ ట్రైలర్‌ అందరికి నచ్చింది. ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్‌ కుదిరాయి. అందరికి మంచి థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా’ అని అన్నారు. ‘సినిమా చాలా బాగుంటుంది. దర్శకుడు అనుకున్నది అనుకున్నట్లుగా స్క్రీన్‌పై ప్రజెంట్‌ చేశాడుఅని నిర్మాత వంశీ సీమకుర్తి చెప్పారు. మరో నిర్మాత శ్వేత పసుపులేటి మాట్లాడుతూ,'టైటిల్‌కు తగ్గట్టుగా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఓ కొత్త సినిమాను చూశామన్నఅనుభూతికి లోనవుతారు అని తెలిపారు. దర్శకుడు అర్జున్‌ కోలా మాట్లాడుతూ,’ఈ మూవీ టైటిల్‌, కాన్సెప్ట్‌ను మన చుట్టు జరుగుతున్న ఇన్‌సిడెంట్స్‌ ఆధారంగా తయారు చేసుకున్నాను. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌ ఇది. ఈ సినిమా కోసం అందరూ దిబెస్ట్‌ ఇచ్చారు. కథ తప్పకుండా ఎంగేజింగ్‌గా ఉంటుంది. వంశీ ‘అన్వేషణతరహాలోనే అందర్ని కట్టిపడేసే సినిమా ఇది అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -