Monday, April 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం కొనుగోళ్లలో కొత్త విధానం అమలు

ధాన్యం కొనుగోళ్లలో కొత్త విధానం అమలు

- Advertisement -

తూకం వేసిన వెంటనే ఆన్లైన్ ట్రక్ట్ జారీ
జీపీఎస్ వాహనాల్లో మిల్లులకు రవాణా
నవతెలంగాణ – మల్హర్ రావు

యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలు చేస్తోంది.ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏ రోజు ధాన్యం లోడ్ చేస్తే అదేరోజు రైతు,ధాన్యం వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. గతంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేసిన తర్వాత మాన్యువల్ ట్రక్ట్తో రైస్ మిల్లులకు పంపించారు. అనంతరం సొసైటీ సిబ్బంది ట్రక్ట్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినపుడు రైతుకు ఓటీపీ వచ్చేది. కాగా, కొత్త విధానంతో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యమేర్పడే అవకాశముందని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు.

కొనుగోళ్లు ఇలా..
మండలంలో యాసంగి సీజన్లో 10,200 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా 1.50 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. సహకార సంఘం ఆధ్వర్యంలో మొత్తం 13 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.25 లక్షల లక్షల క్వింటాళ్ళు ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు తాడిచెర్ల, పెద్దతూండ్ల, అడ్వాలపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. మిగతా గ్రామాల్లో ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ప్రస్తుత యాసంగి సీజన్ నుంచి ధాన్యం కొనుగోళ్లలో అమలు చేయనున్న కొత్త విధానం ఆందోళన కలిగిస్తోంది. కొత్త విధానం ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు ధాన్యం తూకం వేసిన వెంటనే రైతు పేరు, ఎన్ని క్వింటాళ్ల ధాన్యం వివరాలను ఆన్లైన్లో నమోదు చేయగానే రైతుకు ఓటీపీ వస్తోంది.

అనంతరం ఆన్లైన్ ట్రక్ట్ జారీ చేయడం ద్వారా ధాన్యం, రైసుమిల్లు వివరాలు రైతు తెలుసుకునే అవకాశముంది. అంతేకాకుండా ఆన్లైన్లో చూపించిన రైసుమిల్లుకు మాత్రమే జీపీఎస్ ఉన్న ట్రాక్టర్లు, లారీల్లో ధాన్యం లోడ్ పంపించాల్సి ఉంటుంది. అయితే కేంద్రాలకు ఒక్కటే ట్యాబ్ ఇవ్వడంతో ఏ రోజు ధాన్యం లోడ్ చేస్తే అదే రోజు వివరాలను ఆన్ లైన్లో నమోదు చేయడంలో జాప్యమేర్పడే అవకాశ ముందని నిర్వాహకులు పేర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -