- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: దేశంలో 2027 జనాభా లెక్కలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇది రెండు దశల్లో సాగుతుంది. మొదటి దశలో ఇండ్లు, సంబంధిత వివరాలు నమోదు చేస్తారు. రెండో దశలో జనాభా గణన జరుగుతుంది. మొదటి దశలో ఎన్యుమరేటర్స్ స్వయంగా ప్రజల ఇండ్ల వద్దకు వచ్చి సమాచారం సేకరిస్తారు. అయితే, ఈసారి ఈ ప్రక్రియను సెల్ఫ్ ఎన్యుమరేషన్ కోటా ద్వారా కూడా పూర్తి చేయొచ్చు. ప్రభుత్వం ఈ ఏడాది జనగణన కార్యక్రమాన్ని డిజిటల్ విధానం ద్వారా కూడా చేపట్టడంతో ప్రజలు తమ వివరాలను నేరుగా పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు. https://se.census.gov.in/ ద్వారా పౌరులు తమ వివరాల్ని నమోదు చేసుకోవచ్చు.
- Advertisement -



