- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వెనిజులాను వణికించిన జంట భూకంపాల కారణంగా మృతుల సంఖ్య 1,430కు చేరింది. ఈ విపత్తులో 3,238 మంది గాయపడగా, 3,142 మంది నిరాశ్రయులయ్యారు. ఇంకా పలువురి ఆచూకీ తెలియకపోవడంతో సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, తాగునీటి కొరత తీవ్రంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు సైన్యంతో పాటు మిత్రదేశాల నుంచి వచ్చిన 1,600 మంది సిబ్బంది సహాయక, పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేశారు.
- Advertisement -



