- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ‘రైతు భరోసా’ నిధుల విడుదలకు ప్రభుత్వం నిధుల సమీకరణ వేగవంతం చేసింది. ఎకరానికి రూ. 6,000 చొప్పున సుమారు 73 లక్షల మంది అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయనుంది. ఈ నెల 30న ఖమ్మం జిల్లాలో నిర్వహించే బహిరంగసభలో సీఎం రేవంత్ ఈ నిధులను విడుదల చేయనున్నారు. అయితే ఈ నిధులను ఒకేసారి విడుదల చేస్తుందా లేదా విడతల వారీగా జమ చేస్తుందా అనేది తెలయాల్సి ఉంది.
- Advertisement -



