నవతెలంగాణ – అచ్చంపేట
యువత మత్తు పదార్థాలకు బానిసలు అయితే వారి జీవితం నాశనం అవుతుందని అచ్చంపేట పోలీస్ సిఐ నాగరాజు అన్నారు. మంగళవారం అచ్చంపేట పట్టణంలో షీ టీం ఆధ్వర్యంలో యువతకు 99 రోజుల ప్రజా పాలనలో భాగంగా మహిళల చట్టాల గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రధానంగా యువత నేటి సమాజంలో గౌరవప్రదమైన గుర్తింపు వచ్చేలా ఎదగాలని సూచించారు. సాంకేతిక రంగం తీవ్రంగా విస్తరిస్తోందని అన్నారు. నేటి యువత డిజిటల్ ప్రపంచంలో సన్మార్గంలో నడవాలని సూచించారు. అదేవిధంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ధైర్యంగా ఎదిరించాలన్నారు.
సెల్ ఫోన్లలో వచ్చే ఎలాంటి లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు. విద్యార్థినులపై ఆకతాయిలు ఎలాంటి బెదిరింపులకు పాల్పడినా ఎదిరించి నిలవాలని ధైర్యం చెప్పారు. అత్యవసర సమయాలలో డైయల్ :100 నెంబర్ లేదా షీ టీం నెంబర్ 8712657676 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. విద్యార్థి దశ చదువుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి చెడు అలవాట్లకు బానిసలు కావద్దని సూచించారు. కార్యక్రమంలో అచ్చంపేట ఎస్సై సద్దాం హుస్సేన్, షీ టీం ఎస్సై ఇందిర, హెడ్ కానిస్టేబుల్ పద్మ , షీ టీం బృందం సభ్యులు మల్లేష్, వెంకట్ ఉన్నారు.



