Tuesday, April 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకొత్త డీజీపీగా సీవీ ఆనంద్

కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూపీఎస్సీ ఎంపానెల్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం సీవీ ఆనంద్ హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన డీజీపీగా ప్రమోషన్ పొందనున్నారు. ఈ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ నియామకం అమల్లోకి వస్తుంది. తెలంగాణ ప్రస్తుత డీజీపీ కె. శివధర్ రెడ్డి ఏప్రిల్ 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ బాస్‌గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -