Thursday, August 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రముఖ నటుడు నారాయణరావు ఇకలేరు

ప్రముఖ నటుడు నారాయణరావు ఇకలేరు

- Advertisement -

వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్ష‍కులను మెప్పించిన నటుడు జీవీ నారాయణ రావు (73) ఇకలేరు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమ స్యలతో బాధపడుతున్న ఆయన గురువారం సాయంత్రం కన్ను మూశారు. కృష్ణాజిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించిన నారాయణ రావు బాల్యం, విద్యాబ్యాసం గుంత కల్లులో సాగింది. గిడుగు విశాలాక్షి వద్ద భరత నాట్యం, నటరాజ రామకృష్ణ వద్ద కూచిపూడి నృత్యం, ఎ.ఆర్.కృష్ణ వద్ద నటన నేర్చుకున్నారు. చదువుకునే రోజులలో మహమ్మద్ బీన్ తుగ్లక్, ప్రతాపరుద్రీయం, మంచుతెర తదితర నాటకాలలో నటించారు. 100కు పైగా చిత్రాల్లో నటించిన నారాయణరావు సినీ ప్రయాణం 1976లో కె.బాలచందర్ దర్శ కత్వం వహించిన ‘అంతులేని కథ’ చిత్రంతో ఆరంభమైంది. తొలి సినిమాకే ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకోవడం విశేషం.

పలు విజయవంతమైన చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన ఆయన కేవలం సినిమాలకే పరిమితం కాకుండా టెలివిజన్ సీరియళ్ల లోనూ తన వైవిధ్యమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించు కున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా మారి పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించారు. ముఖ్యంగా చిరంజీవి హీరోగా ‘దేవాంతకుడు’, ‘యముడికి మొగుడు’ వంటి చిత్రాలను నిర్మించి ఘన విజయా లను అందుకున్నారు. ‘అంతులేని కథ’, ‘ముత్యాల పల్లకి’, ‘అంగడి బొమ్మ’, ‘చిల కమ్మ చెప్పింది’, ‘గ్యాంగ్ లీడర్’, హిట్లర్ వంటి సినిమాల్లో నటించారు.
నారాయణరావు మృతిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సంతాపం తెలిపింది. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఆత్మీయ మిత్రుడు
జీవీ నారాయణ రావు మృతి పట్ల ఆయన మిత్రుడు, అగ్రనటుడు చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో తన కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
‘1976లో ‘అంతులేని కథ’తో వెండితెరకు పరిచయమైన నా ఆత్మీయ మిత్రుడు ఎన్నో చిత్రా ల్లోనూ, పలు సీరియళ్లలోనూ తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తనతో సన్నిహితమైన అనుబంధం ఉంది. ‘దేవాంతకుడు’, ‘యము డికి మొగుడు’ వంటి చిత్రాలను నాతో నిర్మించిన నిర్మాతగా మా ప్రయా ణంలో ఎన్నో మధురమైన జ్ఞాప కాలు ఉన్నాయి. – చిరంజీవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -