Thursday, August 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలువినూత్నంగా సాంగ్‌ లాంచ్‌

వినూత్నంగా సాంగ్‌ లాంచ్‌

- Advertisement -

హీరో నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ చిత్రం ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్‌కి సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు. తన మ్యూజిక్‌తోనే కాకుండా పాటలను సరికొత్తగా పెర్ఫామ్ చేయడంలోనూ ట్రెండ్ సెట్ చేసే అనిరుధ్ రవిచందర్ ఈసారి కూడా ప్రత్యేకమైన ప్లాన్‌తో ముందుకొచ్చారు. హై ఎనర్జీ ఫోక్ మాస్ ఆంథమ్‌గా రూపొందిన ఈ పాటను నేడు (శుక్రవారం) అమెరికాలోని డల్లాస్‌లో జరగనున్న అనిరుధ్ కాన్సర్ట్ లో లాంచ్ చేయనున్నారు. వేలాది మంది అభిమానుల సమక్షంలో లైవ్ సెలబ్రేషన్స్ మధ్య ఈ పాటను ఆవిష్కరించనున్నారు. ఈ ప్రత్యేక లాంచ్‌లో హీరో నాని కూడా అనిరుధ్‌తో కలిసి సందడి చేయనున్నారు. కాన్సర్ట్ ప్రత్యేక ప్రదర్శన అనంతరం 29న ఈ పాటను ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌గా విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 24న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్‌, స్పానిష్ భాషల్లో పాన్-వరల్డ్ స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -