Thursday, August 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి..

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి..

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను : ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆలేర్ పట్టణంలో గురువారం రాత్రి  భారత్  పెట్రోల్ బంకు సమీపంలో  చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన రాములు వయసు  దాదాపు 50  ఆలేరు పట్టణంలో ప్లాస్టిక్ బాటిల్స్ చిత్తు కాగితాలు సేకరించి జీవనం సాగిస్తున్నాడు. పట్టణంలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద రోడ్డు దాటుతుండగా,  హనుమకొండ డిపోకు చెందిన టీజీ 0 జెడ్  0094 నెంబర్ గల ఆర్టీసీ బస్సు హనుమకొండ నుండి హైదరాబాదు వెళ్తుండగా ఆకస్మికంగా ఢీకొట్టింది.  అక్కడికక్కడే మృతి చెందాడు. గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన రాములుగా గుర్తించారు.

 పంచానామా నిమిత్తం మృతదేహాన్ని ఆలేరు ప్రభుత్వాసుపత్రికి పోలీసులు  తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆలేరు  ఎస్ హెచ్ ఓ   ఉదయ్ కిరణ్  తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -