Thursday, August 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీరామగిరి గ్రామంలో ఎస్ ఐ ఆర్  ఓటర్ జాబితాపై గ్రామ సభ

శ్రీరామగిరి గ్రామంలో ఎస్ ఐ ఆర్  ఓటర్ జాబితాపై గ్రామ సభ

- Advertisement -

– శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాధురి ప్రశాంత్ 
నవతెలంగాణ నెల్లికుదురు 
: మండలంలోని శ్రీరామగిరి గ్రామంలో ఎస్ ఐ ఆర్ ఓటరు జాబితా పై గ్రామ సభ నిర్వహించినట్లు గ్రామ సర్పంచ్ మాధరి ప్రశాంత్ తెలిపారు. గురువారం జిపిఓ విజయ్ పంచాయతీ కార్యదర్శి మౌనిక తో కలిసి గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్. ఓటర్ జాబితాకు సంబంధించిన అంశాలపై గ్రామస్థులకు వివరించారు. డ్రాప్ట్ ఓటరు జాబితాలో పేర్ల నమోదు, తొలగింపు, మార్పులు, అభ్యంతరాలు తదితర అంశాలపై చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని బి ఎల్ ఓ లు జాగ్రత్తగా పడాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించేందుకు బిఎల్వోలు కృషి చేయాలని సూచించారు.ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఫామ్ 6 ద్వారా కొత్త ఓటు నమోదు చేసుకోవాలని యువకులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో  గ్రామపంచాయతీ ప్రజాప్రతినిధులు, అధికారులు, జిపిఓ జీ. విజయ్, పంచాయతీ కార్యదర్శి చెరుక మౌనిక, బి ఎల్ ఓ లు  రామగిరి ఉప్పలయ్య, నిమ్మల విజయలక్ష్మి, బి ఎల్ ఎ లు  లు,గ్రామస్థులు, సిబ్బంది పాల్గొన్నారు. పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -