Tuesday, April 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కిశోర బాలికల సంరక్షణ, అభివృద్ధిసై అవగాహన

కిశోర బాలికల సంరక్షణ, అభివృద్ధిసై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా కిశోర బాలికల సంరక్షణ, వారి అభివృద్ధిపై భూపాలపల్లి జిల్లా మహిళ సంక్షేమశాఖ (డిడబ్ల్యూఓ) అధికారి మల్లీశ్వరి, ఐసిడిఎస్ మహదేవపూర్ ప్రాజెక్టు సిడిపిఓ రాధిక ఆదేశాల మేరకు మండల కేంద్రమైన తాడిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్ బండి స్వామి  అధ్యక్షతన అవగాన కార్యక్రమాన్నీ నిర్వహించినట్లుగా అంగన్వాడిల సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితులుగా తహశీల్దార్ రవికుమార్, ఏపీఎం హనుమంతరావు మాట్లాడుతూ.. బాలల భద్రత రక్షణ, మాదక దవ్యాల వ్యతిరేక సంక్షేమ వారంలో భాగంగా కిషోరబాలికలకు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని తెలిపారు.

పిల్లలు చదువులో ముందంజలో ఉండి  అనుకున్నలక్ష్యంను చేరుకోవాలన్నారు. ఈ వయసులో ఎలాంటి ఆకర్షణలకు గురికాకుండా ఎంచుకున్న గోల్స్ నీ చేరుకోవడానికి కష్టపడాలని సూచించారు. బాల్య వివాహాల నిర్మూలన కిశోర బాలికలకు గల అవగాహన తోనే సాధ్యమన్నారు. అనంతరం సూపర్ వైజర్ మాట్లాడుతూ.. చిరుధాన్యాల పైన అవగాహన, అంగన్వాడీ సెంటర్లో అందిస్తున్న మిల్లెట్స్ పల్లి పట్టీలు తినాలని సూచించారు. కిశోర బాలికలు ఎదుగుతున్న వయసు కాబట్టి ఈ సమాజంలో ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్లాలో తెలియజేశారు. కిశోర బాలికలకు ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వారికి అందుబాటులో అంగన్వాడీ టీచర్ ఉంటారని చెప్పారు. అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ వినయ్ మాట్లాడుతూ.. పిల్లలకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని, హిమోగ్లోబిన్ 12.5% ఉండేటట్టు చూసుకొని, అలాగే 14 సంవత్సరాలు నిండిన పిల్లలు సర్వికల్ క్యాన్సర్ రాకుండా చూసుకోవాలని చెప్పారు. చైల్డ్ లైన్ కేసు వర్కర్ సాయిరాం మాట్లాడుతూ.. ఆపద సమయంలో హెల్ప్ లైన్ నెంబర్స్ అయినటువంటి 1098,181,100 వాటిని వారికి వివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం సీసీలు, వివోఏలు, అంగన్వాడీ టీచర్స్, కిషోర బాలికలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -