నవతెలంగాణ-ఆలేరు టౌన్
తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు కొరకు అనేకమంది యువకులు ప్రాణ త్యాగం చేశారని, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఆలేరు పట్టణంలో శుక్రవారం రైల్వే గేటు వద్ద నిర్మించబోయే తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద, మలిదశ ఉద్యమకారులనుద్దేశించి మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు నియోజకవర్గం ఇంచార్జ్ గొంగడి సునీతా మహేందర్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో మలిదశ ఉద్యమకారుల సంఘం ఏర్పాటుచేసి హక్కుల సాధన కొరకు కృషి చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాసుని అభినందించారు.
ఈ కార్యక్రమంలో మలిదశ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జంపాల శ్రీనివాసు జిల్లా మహిళా అధ్యక్షురాలు సీసా మహేశ్వరి, కవిత, దేశ ఉద్యమకారుల సంఘం కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



