Thursday, September 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడిగా బోయపల్లి రాజేష్ ఏకగ్రీవం

సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడిగా బోయపల్లి రాజేష్ ఏకగ్రీవం

- Advertisement -

కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్న సర్పంచులు
నవతెలంగాణ – చండూరు 

చండూరు మండల సర్పంచుల ఫోరం కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చండూరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా, తుమ్మలపల్లి గ్రామ సర్పంచ్  బోయపల్లి రాజేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శి లేదన్న సత్యం,( కస్తాల గ్రామం,)ఉపాధ్యక్షులు గాలెంక రాంబాబు,( పడమటి తల్లా )ఆలేటి యాదయ్య( జోగు గూడెం ) -కార్యదర్శులు కావలి శివాని సురేష్( ఉత్తల పల్లి గ్రామ సర్పంచ్ ), బొమ్మల సుగుణ శంకర్,( బోడంగిపర్తి గ్రామ సర్పంచ్) కోశాధికారి గా ముదిగొండ ఆంజనేయులు( చామల పల్లి గ్రామ సర్పంచ్ ) మండలంలోని సర్పంచులందరి సమక్షంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు  బోయపల్లి రాజేష్ మాట్లాడుతూ.. మండల అభివృద్ధి, గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు జాల వెంకన్న, దామర రాములు, రజితా రవి, బోయపల్లి సునీత, నారప్పక వసంత దానయ్య, కొండ అనిత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -